వనపర్తి జిల్లాలో ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పంచాయితీ ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలని వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన ఆరోపణ చేశారు.
ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ, “నలబై ఏళ్ళుగా ఆ పెద్దమనిషి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అలాంటి సీనియర్ ఈ ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నించాలి. కానీ నామీద కోపంతో అయన అందరికీ ఫోన్లు చేసి, చేయించి బీఆర్ఎస్ అభ్యర్ధులకే ఓట్లు వేయాలని, కాంగ్రెస్ అభ్యర్ధులను ఓడగొట్టాలని చెప్పారు.
నేను ఊరికే ఆయనపై ఈ ఆరోపణ చేయడం లేదు. నేను పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశాను. అక్కడి స్థానిక నేతలు, ప్రజలే ఈ విషయం చెప్పారు. ఒకవేళ ఆ పెద్దమనిషికి నేనంటే పడకపోతే వచ్చి నాతో తేల్చుకోవాలి కానీ ఇలా ఎన్నికలలో సొంత పార్టీని ఓడించుకోవడం చాలా దారుణం.
రేపు నేను మరోసారి మీడియా సమావేశం నిర్వహించి వనపర్తి జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి పూర్తి లెక్కలతో అన్ని వివరాలు చెప్తాను,” అని అన్నారు. మేఘారెడ్డి ఏమన్నారో ఆయన మాటలలోనే....
వీడియో: చోటా న్యూస్ యాప్ సౌజన్యంతో...