పెద్దిని దెబ్బ తీసేందుకు సిద్దమవుతున్నారా?

December 20, 2025


img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్‌, జాన్వీ కపూర్ జంటగా పెద్ది సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది విడుదల కాబోతోంది. ఈ సినిమాలో చికిరి చికిరి పాటతో అంచనాలు మరింత పెరిగాయి. కనుక ప్రేక్షకులు ఆసక్తిగా పెద్ది కోసం ఎదురుచూస్తున్నారు.

మరోపక్క సినిమా రివ్యూలు వ్రాసే కొందరు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని పెద్ది గురించి అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. వారిలో ఒకరు “పెద్ది సినిమా స్టోరీ నాకు తెలుసు కానీ లీకులు చేస్తే గొడవవుతుంది,” అని అంటే మరొకరు “సినిమా కధ విన్న తర్వాత సినిమా ఎలా ఉంటుందని మీకనిపించింది?” అని అడుగుతారు.

దానికి అతను సమాధానం చెపుతూ, ఈ కధతో సినిమా తీస్తున్నారు... మళ్ళీ చికిరీలు బికిరీలని పెట్టి..” అని నవ్వుతూ జవాబు చెపుతాడు.

వారి వీడియో కాన్ఫరెన్స్ బయటకు ఎలా లీక్ అయ్యిందో తెలీదు కానీ అది నటుడు విశ్వక్‌ సేన్‌ దృష్టికి వచ్చింది. దానిని ట్యాగ్ చేస్తూ, “సినీ పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతూ దాని నాశనం కోరుకుంటున్న ఇటువంటి వ్యక్తి చీడపురుగు లాంటివాడు కాదా?సినిమా రిలీజ్ కాక ముందే దానిని ఈవిధంగా దెబ్బ తీయాలనుకోవడం తింటున్న కంచంలో ఉమ్మేసుకోవడమే,” అని విశ్వక్‌ సేన్‌ ఘాటుగా విమర్శించారు. 

వాళ్ళేమన్నారో వాళ్ళ మాటల్లోనే ...         



Related Post

సినిమా స‌మీక్ష