పెద్ది... మూలాలు మరిచిపోలేదు!

December 19, 2025


img

రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ సినిమా ట్రైలర్‌ లాంచింగ్ ఈవెంట్‌ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ చెప్పిన నాలుగు మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. 

“నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ఆనాడు వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్‌గారు నన్ను నా తొలి సినిమా ‘చిరుత’తో సినీ పరిశ్రమకు పరిచయం చేయడమే. 

నేను ఇదివరకే ఆయనకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకున్నానో లేదో నాకు గుర్తులేదు. కానీ మళ్ళీ ఇప్పుడావకాశం వచ్చింది కనుక చెప్పుకుంటున్నాను. 

జూ.ఎన్టీఆర్‌ మొదటి సినిమా స్టూడెంట్ నం.1, అల్లు అర్జున్‌ మొదటి సినిమా గంగోత్రి, నాకు చిరుత, ఇప్పుడు రోషన్‌కి ఛాంపియన్ ఇలా... ఎంతో మందిని సినీ పరిశ్రమకి పరిచయం చేసి హీరోలుగా ఎదిగేందుకు తోడ్పడ్డారు. ఈ సందర్భంగా మా దత్తుగారికి, వైజయంతీ మూవీస్ టీమ్‌ సభ్యులందరికీ నేను పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను,” అని రామ్ చరణ్‌ అన్నారు. 

తండ్రి చిరంజీవిలాగే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని, తన ఎదుగుదలకు సాయపడిన ఎవరినీ మరిచిపోకూడదని, ఇలాంటి సందర్భం వస్తే సభా ముఖంగా వారు చేసిన సాయం గురించి చెప్పుకొని ధన్యవాదాలు తెలియజేసుకోవాలని రామ్ చరణ్‌ నేర్చుకోవడం చాలా అభినందనీయమే కదా?                        


Related Post

సినిమా స‌మీక్ష