రోషన్ హీరోగా ‘ఛాంపియన్’ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది.
భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం నవాబు సేనల ఆగడాలు, తెలంగాణలో బైరాన్‌పల్లిలో జరిగిన దమనఖాండ ట్రైలర్‌లో చూపారు. ఇప్పటి వరకు స్వాతంత్ర్య పోరాటాల నేపధ్యంలో అనేక పీరియాడికల్ మూవీస్ వచ్చాయి. కానీ ఇంతవరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ బైరాన్‌పల్లి పోరాటాలను రోషన్ సినిమాకు ఎంచుకోవడం ప్లస్ పాయింట్ అవుతుంది. ఇదొక్కటే చాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు.
కానీ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ సినిమాలో హీరో లండన్‌లో విలాసవంతమైన జీవితం, ఫుట్‌బాల్ చాంపియన్, ఓ చక్కటి గ్రామీణ ప్రేమకధ, హీరో పోరాటాలను కూడా కలిపారు. కనుక మామూలు ఛాంపియన్ కాదు. అంతకు మించే అనుకోవచ్చు.
ట్రైలర్ చూస్తే సినిమా బాగానే తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. కానీ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇన్ని అంశాలను సరిగ్గా కనెక్ట్ చేస్తూ ఈ కధని చక్కగా సినిమాగా మలచగలిగారా లేదా? అనేది డిసెంబర్ 25న విడుదల అయితే కానీ తెలీదు.
ఈ సినిమాలో రోషన్, అనస్వర రాజన్ జంటగా చేశారు. స్వాతంత్ర్య పోరాటాలు సాగుతున్న సమయంలో ఫుట్ బాల్ ఆట నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రదీప్ అద్వైతం, సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: మాదే ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, స్టంట్స్: పీటర్ హెయిన్,చేస్తున్నారు.
స్వప్న సినిమా, ఆనందీ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రియాంకా దత్, జీకె మోహన్, జెమిని కిరణ్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.