కొండగట్టు అభివృద్ధి పనులకు టిటిడీ 30 కోట్లు

December 19, 2025
img

తెలంగాణలో అనేకానేక పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం కూడా ఒకటి. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. స్వామివారిని తరచూ దర్శించుకునేవారిలో ఏపీ డెప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ కూడా ఒకరు.

ఆయన కొత్తగా ఏ పెద్ద నిర్ణయం తీసుకున్నా ముందుగా కొండగట్టుకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 2024 ఏపీ శాసనసభ ఎన్నికలలో ప్రచారానికి బయలుదేరే ముందు కొండగట్టుకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ‘వారాహి’ ప్రచార వాహనానికి కొండగట్టులోనే వాహనపూజ చేశారు.

స్వామివారి ఆశీసులతో ఎన్నికలలో పోటీ చేసిన అన్ని స్థానాలలో జనసేన విజయం సాధించింది. పవన్‌ కళ్యాణ్‌ ఏపీ డెప్యూటీ సిఎం, అటవీ శాఖ మంత్రి అయ్యారు. కనుక టిటిడీతో మాట్లాడి కొండగట్టు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించవలసిందిగా కోరారు. ఆయన సూచన మేరకు టిటిడీ రూ.30 కోట్లు కేటాయించింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. 

Related Post