యూట్యూబర్ నిత్య క్యూట్ బేబీ ఇటీవల శ్రీశైలం మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకున్నప్పుడు, ఆలయానికి దూరంగా రోడ్డుపై డాన్స్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిపై నెటిజన్స్ మండిపడ్డారు.
వాటిపై ఆమె స్పందిస్తూ, “నేను ఏ తప్పు చేయలేదు. గుడి ఆవరణలో డాన్స్ చేయలేదు. దూరంగా రోడ్డుపై ఓ జానపద గీతానికి డాన్స్ చేశాను. అదీ నేను కురచ దుస్తులు ధరించలేదు. సాంప్రదాయబద్దంగా చీర కట్టుకొని డాన్స్ చేశాను.
అక్కడ లొకేషన్ బాగుందని డాన్స్ చేశాను తప్ప ఎవరినీ బాధ పెట్టాలని కాదు. అయినా నన్ను విపరీతంగా ట్రోల్ చేశారు. ఏ తప్పూ చేయకపోయినా నేను ఏదో మహాపరాధం చేశానన్నట్లు కొందరు విమర్శించారు.
నేను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కొందరు, నాపై పోలీస్ కేసు నమోదు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. వారి కామెంట్స్ చూసి నేను చాలా బాధపడ్డాను. నేను ఏ తప్పు చేయలేదు. కానీ చేశానని కొందరు భావిస్తున్నారు. కనుక వారందరికీ చేతులు జోడించి క్షమించమని కోరుతున్నాను,” అంటూ వీడియో మెసేజ్ పెట్టారు.
లొకేషన్ బాగుందని పద్దతిగా చీర కట్టుకొని రీల్ చేశా. అది కూడా టెంపుల్ బయట రోడ్ మీద చేశా
దానికే నా మీద ఇష్టమొచ్చిన కామెంట్లు పెడుతున్నారు.
ఒకవేళ నేను తప్పు చేశానని మీరు అనుకుంటే సారీ అని వీడియో రిలీజ్ చేసింది.
- శ్రీశైలం ఆలయం దగ్గర రీల్స్ చేసిన యువతి https://t.co/sEUK4Ykd9w pic.twitter.com/n41T7pDtgc
వీడియో: చోటా న్యూస్ సౌజన్యంతో...