హైదరాబాద్‌లోనే రాజాసాబ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

December 20, 2025


img

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రాజాసాబ్‌ చాలా భారీ అంచనాలతో జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక ఒకరోజు ముందే ప్రీమియర్స్ ఉంటాయని నిర్మాత టిజి విశ్వప్రసాద్ చెప్పారు.

రాజాసాబ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. ఎప్పుడనేది త్వరలో తెలియజేస్తామని చెప్పారు. డిసెంబర్‌ 31, జనవరి 1న అందరూ న్యూఇయర్ వేడుకలలో బిజీగా ఉంటారు కనుక రెండు రోజుల ముందుగా అంటే డిసెంబర్‌ 27 (శనివారం) లేదా జనవరి మొదటి వారంలో రాజాసాబ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించే అవకాశం ఉంది. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.  

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష