మాస్ మహారాజ్ రవితేజ మాస్ సినిమాలు చేస్తూ ఎదురుదెబ్బలు తింటున్నారు కానీ ఇప్పుడు చేస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి,’ వంటి కామెడీ కధ ఇస్తే ఎలా చెలరేగిపోతారో టీజర్ చూస్తే అర్ధమవుతుంది.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో సిద్దమవుతున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి చేస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల ప్రశాంత్ కిషోర్, సునీల్, సత్య, శుభలేక సుధాకర్, మురళీధర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కిషోర్ తిరుమల,సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్: ఈ సందర్భంగా ప్రకాష్ చేస్తున్నారు.
ఎస్ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి పండగకు భర్త మహాశయులకు విజ్ఞప్తి చేసేందుకు వస్తున్నారు.