వైజాగ్ బీచ్‌లో చాంపియన్ నైట్

December 19, 2025


img

ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రోషన్ హీరోగా ‘ఛాంపియన్’ సినిమా డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది. నిన్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నెల 21న వైజాగ్ బీచ్ రోడ్డులోని గోకుల్ పార్కులో చాంపియన్ నైట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు. దీనిలో పాల్గొనేందుకు శ్రేయాస్ గ్రూప్ ఆన్‌లైన్‌లో ఉచితంగా పాసులు జారీ చేస్తోంది. ఆసక్తి గలవారు www.shreyasgroup.net  నుంచి వీటిని పొందవచ్చు.      

ఈ సినిమాలో రోషన్, అనస్వర రాజన్‌ జంటగా చేశారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: ప్రదీప్ అద్వైతం, సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: మాదే ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు, స్టంట్స్: పీటర్ హెయిన్,చేస్తున్నారు. స్వప్న సినిమా, ఆనందీ క్రియేషన్స్ బ్యానర్లపై ప్రియాంకా దత్, జీకె మోహన్, జెమిని కిరణ్ కలిసి ఈ సినిమా నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష