బైడెన్ భార్య హారిస్ భర్తకి ముద్దు... అదేంటో?

February 08, 2023
img

అవును. అమెరికా అధ్యక్షుడు భార్య జిల్ బైడెన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌగ్ ఎంఎఫ్‌కి బహిరంగంగా అందరూ చూస్తుండగా పెదవుల ముద్దు పెట్టారు! అది చూస్తూ చుట్టూ ఉన్నవారు చప్పట్లు కొట్టారు! స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగానికి ముందు ఇది జరిగింది. ఆ సభలో ప్రసంగించడానికి వచ్చిన జిల్ బైడెన్ మొదట ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వాబోతున్నట్లు దగ్గరకి వచ్చారు కానీ షేక్ హ్యాండ్‌ ఇవ్వకుండా డౌగ్ ఎంఎఫ్‌ పెదవులపై ముద్దు పెట్టి ముందుకు సాగారు. ఆ తర్వాత ఆయన కూడా ఆమె వెనుకే వెళ్ళి ఆమె పక్కనే కూర్చోన్నారు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ వారి ముద్దూముచ్చటని చకచకా ఫోటోలు తీసి మీడియాలోకి అక్కడి నుంచి సోషల్ మీడియాలోకి ఎక్కించేశారు. సుమారు 8 సెకన్ల నిడివి గల ఈ వీడియో సహజంగానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి 8.50 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఎంతగా వైరల్ అయ్యిందో అర్దం చేసుకోవచ్చు. వారి ముద్దు సీన్‌పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. 

అమెరికా తదితర దేశాలలో స్త్రీ, పురుషులు భార్యాభర్తలు అయితే తప్ప పెదాల మీద బహిరంగంగా ముద్దు పెట్టుకోరు. షేక్ హ్యాండ్ ఇచ్చుకొంటారు. మరికాస్త చనువు ఉంటే బుగ్గలు తాకించుకోవడంతో సరిపెడతారు. కనుక అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ ఉపాధ్యక్షురాలి భర్తకి బహిరంగంగా పెదవిపై ముద్దు పెట్టడం వెనుక వారి మద్య ఏమైనా రోమాంటిక్ స్టోరీ మొదలైందా? అనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి. కానీ ఆమె కేవలం ఆప్యాయంగా ఆయనకి చిన్న ముద్దిచ్చారు... అంతే! అని మరికొందరు వాదిస్తున్నారు. వాస్తవం ఏమిటో వారిద్దరికే తెలియాలి!                 

Related Post