టర్కీ, సిరియాలో శిధిలాల కింద ఇంకా 1.80 లక్షల మంది!!!

February 08, 2023
img

మొన్న సోమవారం టర్కీ, సిరియా దేశాలలో సంభవించిన పెను భూకంపం ధాటికి వేలాది భవనాలు కూలిపోవడంతో ఆ శిధిలాల క్రింద సుమారు 1.80 లక్షల మంది చిక్కుకొని ఉంటారని ఆ ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ శిధిలాల క్రింద చిక్కుకొన్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గిపోతుంటాయి కనుక మృతుల సంఖ్య నానాటికీ పెరిగే అవకాశం ఉంది. 

ఈ భూకంపాల నుంచి ప్రాణాలతో బయటపడినవారు సహాయ బృందాలతో కలిసి మూడు రోజులుగా శిధిలాల కింద తమ కుటుంబ సభ్యుల కోసం గాలిస్తూనే ఉన్నారు. శిధిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు టర్కీలో సుమారు ఆరు వేలమంది, సిరియాలో రెండువేల మంది శవాలని వెలికితీశారు. రెండు దేశాలలో కలిపి 20 వేలమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. 

మంగళవారం టర్కీలో శిధిలాలు తొలగిస్తుండగా ఓ పసిపాప ఏడుపు వినిపించింది. సహాయ బృందాలు జాగ్రత్తగా శిధిలాలు తొలగించి చూస్తే ఓ మహిళ ఆ శిధిలాల క్రిందే బిడ్డని ప్రసవించి చనిపోయిన్నట్లు గుర్తించారు. ఓ వైపు మరణ మృదంగం మ్రోగుతుండగా అప్పుడే ఆ పసిబిడ్డ తల్లి కడుపులో నుంచి బయటపడి ఈ లోకంలోకి రావడం చూసి అందరూ దైవలీల అంటే ఇదేనేమో? అని అనుకొన్నారు.

     

భారత్‌తో సహా అనేక దేశాలు వెంటనే స్పందించి సహాయ, వైద్య బృందాలని, మందులు, ఆహారం తదితర అత్యవసరమైనవి పంపిస్తూనే ఉన్నాయి. సుమారు 25 వేలమంది రేయింబవళ్ళు ఈ సహాయచర్యలలో పాల్గొంటున్నారు. ఈ భూకంపంలో ఆత్మీయులను కోల్పోవడం ఓ పెను ప్రాణాలు ఇ విషాదం కాగా, ఇళ్ళు కోల్పోయి గజగజ వణికించే చలిలో ఉండేందుకు ఆశ్రయం లేక బాధలు పడవలసి రావడం మరో విషాదమనే చెప్పాలి. రెండు దేశాలలో లక్షలాదిమంది ఆశ్రయం లేక రోడ్లపైనే ఉంటున్నారు. టర్కీ, సిరియాలు ఈ ప్రకృతి విపత్తునుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టవచ్చు.   


Related Post