అమెరికాలో మధిర యువకుడు అఖిల్ సాయి మృతి

February 08, 2023
img

ఉన్నత చదువులు చదవుకొని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఎంతోమంది యువకులు అమెరికాకి వెళుతుంటారు. అయితే వారిలో కొందరు దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మరణిస్తుంటారు లేదా కాల్పులలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంకి చెందిన మహంకాళి అఖిలసాయి (23) కూడా అలాగే ఏడాది క్రితం అమెరికాలో అలబామాలో అల్బర్న్ యూనివర్సిటీలో ఎంఎస్ చేసేందుకు వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు. అదీ... మరో తెలుగు విద్యార్ధి రవితేజ గోలి (23) చేతిలో!

అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి అఖిల్ సాయి తలలో నుంచి తూటా దూసుకుపోవడంతో చనిపోయిన్నట్లు అలబామా పోలీసులు ధృవీకరించారు. కేసు నమోదు చేసి రవితేజ గోలిని అరెస్ట్ చేసి అలబామా రాజధాని మొంటేగోమరి జైలుకి తరలించారు. అఖిల్ సాయి మరణవార్తని హైదరాబాద్‌, కూకట్‌పల్లిలో ఉంటున్న అతని తల్లితండ్రులు మాధవి, ఉమాశంకర్‌లకి తెలియజేశారు. ఉన్నత విద్యలభ్యసించి పెద్ద ఉద్యోగంలో స్థిరపడతాడనుకొంటే చనిపోయాడని, ఇప్పుడు కొడుకు మృతదేహం కోసం అందరినీ అర్ధించవలసివస్తోందని తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.   

రవితేజ, అఖిల్ సాయి కలిసినప్పుడు తుపాకీని పరీక్షిస్తుండగా ప్రమాదవశాత్తు పేలి, తూటా అఖిల్ సాయి తలలో నుంచి దూసుకుపోవడంతో చనిపోయిన్నట్లు సమాచారం. కానీ అలబామా పోలీసులు ఇంకా ధృవీకరించవలసి ఉంది.

Related Post