అమెరికాలో తెలుగు విద్యార్థులపై కాల్పులు.. హైదరాబాద్‌ యువకుడు మృతి

January 24, 2023
img

అమెరికాలో ఉన్నత విద్యలభ్యసించడానికి వెళ్ళిన ముగ్గురు తెలుగు విద్యార్థులపై చికాగో నగరంలో నల్లజాతీయులు కాల్పులు జరుపగా వారిలో హైదరాబాద్‌కి చెందిన నందపు దేవ్‌శిష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. విశాఖపట్నానికి చెందిన కొప్పాల సాయిచరణ్ అనే విద్యార్ది ఊపిరి తిత్తులలోకి తూటా దూసుకుపోయింది. కానీ సకాలంలో వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. విశాఖకే చెందిన లక్ష్మణ్ అనే మరో విద్యార్ధి మాత్రం తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. 

నందపు దేవ్‌శిష్, కొప్పాల సాయిచరణ్, లక్ష్మణ్ ముగ్గురూ పది రోజుల క్రితమే చికాగో వచ్చి ఒకే రూమ్‌లో ఉంటున్నారు. ముగ్గురూ అవసరమైన వస్తువులు కొనుకొన్నేందుకు నిన్న సమీపంలో గల షాపింగ్ మాల్‌కి వెళుతున్నప్పుడు కొందరు నల్లజాతీయులు వారి వెంటపడ్డారు. తుపాకులు చూపి వారి వద్ద ఉన్న డబ్బు, మొబైల్ ఫోన్స్ వగైరా అన్నీ దోచుకొన్నాక వారిపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు హుటాహుటిన అక్కడకి చేరుకొని గాయపడిన దేవశిష్, సాయి చరణ్‌లను అంబులెన్సులు హాస్పిటల్‌కి తరలించారు. వారి సాయి చరణ్ ప్రాణాలు దక్కాయి కానీ దేవశిష్ చనిపోయాడు. 

చికాగోలోని తానా ఫౌండేషన్ సభ్యులు హేమ ఇద్దరు విద్యార్థులకి హాస్పిటల్‌ చికిత్సకి అవసరమైన సహాయసహకారాలు అందించి, వారి తల్లితండ్రులకి ఈ ఘటన గురించి తెలియజేశారు. కొప్పాల సాయి చరణ్ తల్లితండ్రులు కొప్పళ శ్రీనివాసరావు, లక్ష్మి హైదరాబాద్‌లోని భారతీనగర్ డివిజన్‌ పరిధిలో గల ఎల్ఐజీ కాలనీలో నివాసం ఉంటున్నారు.

Related Post