సినీ నటి రంభ కారు యాక్సిడెంట్... కూతురు హాస్పిటల్లో

November 01, 2022
img

అలనాటి ప్రముఖ సినీ నటి రంభ కారుకి కెనడాలో యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ఆమె, ఇద్దరు పిల్లలు, ఆయా ఉన్నారు. అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డారు కానీ రంభ చిన్న కుమార్తె సాషా కొంచెం ఎక్కువ గాయలవడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆమె తన ఇద్దరు పిల్లలని స్కూలు నుంచి ఇంటికి తీసుకువెళుతుండగా వారి వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ వెంటనే తెరుచుకోవడంతో అందరూ స్వల్పగాయాలతో బయటపడ్డామని కానీ తన చిన్న కూతురు సాషా ఇంకా హాస్పిటల్‌లో చికిత్స పొందుతోందని రంభ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ప్రస్తుతం తమకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు అనిపిస్తోందని తన కుమార్తె త్వరగా కోలుకోవాలని అందరూ భగవంతుడిని ప్రార్ధించాలని, మీ ప్రార్ధనలు మాకు ఎంతో అవసరం అని రంభ విజ్ఞప్తి చేశారు. రంభకు సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత ఇంద్రకుమార్ అనే వ్యక్తిని పెళ్ళిచేసుకొని 2010 నుంచి కెనడాలోనే ఉంటున్నారు. 

Related Post