అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్ళు మృతి

October 26, 2022
img

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన పాటంశెట్టి సాయి నరసింహ (23), హైదరాబాద్‌కు చెందిన ప్రేమ్ కుమార్‌ రెడ్డి, వరంగల్‌కు చెందిన పావని చనిపోయారు. వారితో పాటు మినీ వ్యానులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు గాయాలతో బయటపడ్డారు. 

వివరాలలోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లాలో కడియపు లంకకు చెందిన నర్సరీ రైతు పాటంశెట్టి శ్రీనివాస్ కుమారుడు పాటంశెట్టి సాయి నరసింహ కనెక్టికట్ రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం అతను మంగళవారం ఉదయం 5 గంటలకు మినీ వ్యానులో మరో ఏడుగురు స్నేహితులతో కలిసి ప్రయాణిస్తుండగా, దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో అదే రోడ్డులో వెళుతున్న ఓ ట్రక్కును వారి వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పాటంశెట్టి సాయి నరసింహ, ప్రేమ్ కుమార్‌ రెడ్డి, పావని ఘటనా స్థలంలోనే చనిపోయారు. మిగిలినవారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కడియపు లంక గ్రామానికే చెందిన ఎస్‌ ఐశ్వర్య అనే యువతి ఈ ప్రమాదం జరిగిన వాహనంలోనే ఉంది. కానీ స్వల్పగాయలతో బయటపడగలిగింది. 

ఉన్నత విద్యాలభ్యసించదానికి వెళ్ళిన పిల్లలు ఈవిదంగా రోడ్ ప్రమాదంలో చనిపోవడంతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమెరికా నుంచి వారి మృతదేహాలను స్వదేశానికి పంపించేందుకు అమెరికాలో తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. 

Related Post