అమెరికాలో తెలుగు యువకుడు మృతి

October 13, 2022
img

అమెరికాలో ఏపీకి చెందిన హరీష్ చౌదరి (35) మృత్యువాతపడ్డాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా నూజివీడుకి చెందిన నెక్కలపు హరీష్ చౌదరి మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత పదేళ్ళ క్రితం కెనడాకు వెళ్ళి ఇంజనీరుగా ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఈ నెల 8వ తేదీన తన స్నేహితులతో కలిసి అమెరికా వెళ్ళి అక్కడి పర్యాటక కేంద్రాలను చూసుకొంటూ 11వ తేదీన న్యూయార్క్‌లోని ఇతాకా జలపాతం వద్దకు చేరుకొన్నారు. అక్కడ హరీష్ తన స్నేహితులతో కలిసి ఫోటోలు దిగుతూ పొరపాటున కాలు జారీ జలపాతంలో పడి చనిపోయాడు. సమాచారం అందుకొన్న న్యూయార్క్ పోలీసులు గజఈతగాళ్లను దింపి ప్రవాహంలో కొట్టుకుపోయిన హరీష్ చౌదరి మృతదేహాన్ని వెలికి తీశారు. 

హరీష్ చౌదరి నాలుగేళ్ళ క్రితమే సాయి సౌమ్యతో వివాహం జరిగింది. ప్రస్తుతం విజయవాడలో పోరంకిలో తన తల్లితండ్రుల వద్ద ఉన్న ఆమె భర్త చనిపోయాడని తెలిసి షాకులో ఉంది.  తానా సభ్యులు అతని మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Related Post