తానా డైరక్టర్ డా.వాసు కొడాలి భార్య, కుమార్తెలు దుర్మరణం

September 27, 2022
img

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా డైరెక్టర్ డా. వాసు కొడాలి భార్య, ఇద్దరు కుమార్తెలు సోమవారం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. డా.నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి భార్య శ్రీమతి వాణిశ్రీ హ్యూస్టన్ నగరంలో కాలేజీలో చదువుకొంటున్న తన ఇద్దరు కుమార్తెలను తీసుకొని కారులో ఇంటికి తిరిగివెళుతుండగా ఎదురుగా దూసుకువచ్చిన ఓ ట్రక్ బలంగా ఢీకొనడంతో వారు ముగ్గురూ ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఈ దుర్ఘటన అమెరికా కాలమాన ప్రకారం సోమవారం మధ్యాహ్నం 11.30 గంటలకు వాలర్ కంట్రీ అనే ప్రాంతంలో జరిగింది. 

డా.వాసు కొడాలి పెద్ద కుమార్తె వైద్య విద్య అభ్యసిస్తుండగా, రెండో కుమార్తె 11వ తరగతి చదువుతోంది. డా.వాసు అర్దాంగి వాణిశ్రీ కుమార్తెలిద్దరిని దసరా పండుగకని కారులో ఇంటికి తీసుకువెళుతుండగా ముగ్గురూ ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. భార్యా, కుమార్తెలు కారు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర శోకంలో మునిగిపోయిన డా.వాసుకి తానా సభ్యులు ఓదార్చి తోడుగా నిలిచారు. డా.వాసు కుటుంబం ఏపీలో గుంటూరు నగరానికి చెందినవారు. 


Related Post