ఉక్రెయిన్‌ను వశపరుచుకోలేక పుతిన్ నక్క జిత్తులు

May 26, 2022
img

ఉక్రెయిన్‌పై గత మూడు నెలలుగా రష్యా దాడులు చేస్తూనే ఉంది. దీంతో అంతవరకు కళకళలాడిన ఉక్రెయిన్‌ నగరాలు శిధిలాలతో నిర్జీవంగా మారాయి. సుమారు కోటి మందికి పైగా ప్రజలు ఉక్రెయిన్‌ విడిచి పొరుగుదేశాలకు వలస వెళ్ళిపోయారు. 

అయినప్పటికీ రష్యా తన యుద్ధం ఆపలేదు. కానీ నేటికీ ఉక్రెయిన్‌ను పూర్తిగా వశపరుచుకోలేకపోయింది. పైగా ఉక్రెయిన్‌ సేనలు, ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. 

దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ మరో సరికొత్త ఐడియాతో ఉక్రెయిన్‌పై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తమ అధీనంలోకి వచ్చిన ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతంలోని ఖేర్‌సన్‌, ఉక్రెయిన్‌ ఆగ్నేయ ప్రాంతంలోని జాపోరిజ్జియా(జేఫోరిషియ)లలో ఉక్రెయిన్‌ పౌరులందరికీ రష్యా పౌరసత్వం ఇచ్చి వారికి బలవంతంగా రష్యన్ పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తున్నారు. అలాగే రష్యన్ కరెన్సీ రూబుల్స్ ఉక్రెయిన్‌ అధికారిక కరెన్సీగా ప్రకటించింది. 

ఈ చర్యలతో ఉక్రెయిన్‌ పౌరులు రష్యన్ పౌరులవుతారు కనుక ఇకపై ఎవరూ రష్యా సేనలను వ్యతిరేకించరాదు. వ్యతిరేకిస్తే దేశద్రోహ నేరం కింద శ్క్షించబడతారు. ఆయా ప్రాంతాలలో ఉన్నవారి నందరినీ రష్యన్ పౌరులుగా మార్చడం ద్వారా ఆ ప్రాంతాలు రష్యా భూభాగంలోకి తెచ్చుకొన్నట్లవుతుంది. 

అయితే ఇది బలవంతపు పెళ్ళి, బలవంతపు మత మార్పిడిలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని, ప్రజలను అవమానించడమే అని, మానవ హక్కుల ఉల్లంఘనే అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్ స్కీ వాదిస్తున్నారు. ఈ చర్యలను యూరోప్ దేశాలు ఖండించాలని జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. 

Related Post