పాకిస్థాన్‌ మసీదులో ఆత్మహుతి దాడి

March 04, 2022
img

పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలోని కిస్సా జవానీ బజార్ ప్రాంతంలో గల ఓ మసీదులో ఈరోజు మధ్యాహ్నం ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో 30 మంది ఘటనస్థాలంలోనే చనిపోగా మరో 50-60 మంది గాయపడ్డారు. శుక్రవారం మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నా సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ లోనికి ప్రవేశించి తమ శరీరాలకు కట్టుకొన్న బాంబులను పేల్చేసుకొని ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. వారి దాడిలో ఓ పోలీస్ అధికారి మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పెషావర్ పోలీస్ ఆఫీసర్ ఇజాజ్ ఆషాన్ మీడియాకు తెలిపారు. సమాచారం అందగానే పాక్‌ భద్రతాదళాలు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఎక్కడైనా నక్కి ఉన్నారేమో తెలుసుకొనేందుకు ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. ఈ ప్రేలుళ్ళలో చనిపోయినవారి మృతదేహాలను స్థానిక లేడీ రీడింగ్ హాస్పిటల్‌కు తరలించారు. ఇవాళ్ళ రావల్పిండిలో పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మద్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరుగడంతో మిగిలిన మ్యాచ్‌లు కొనసాగుతాయా లేదో తెలీని పరిస్థితి ఏర్పడింది. 


Related Post