గాంధీజీ స్మారకార్ధం ప్రత్యేక నాణం విడుదల చేసిన బ్రిటన్ ప్రభుత్వం

November 05, 2021
img

దీపావళి పండుగ సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం భారత జాతిపిత మహాత్మాగాంధీ ఆశయం, జీవిత అంశాలను ప్రతిబింబిస్తూ ఐదు పౌండ్ల విలువగల ప్రత్యేక నాణ్ణాన్ని విడుదల చేసింది. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ ఆ నాణ్ణాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిషి సునక్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీజీకి ఇది ఘనమైన నివాళి. భారత్‌, బ్రిటన్ రెండు దేశాల మధ్య స్నేహ  సంబంధాలు, సాంస్కృతిక వారధికి ఈ ప్రత్యేక నాణెం చిహ్నంగా నిలుస్తుందని, అన్నారు. ఐదు పౌండ్ల విలువగల ఈ ప్రత్యేక నాణ్ణాన్ని బ్రిటన్ రాయల్ మింట్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ ప్రత్యేక నాణెంలో భారత జాతీయ పుష్పం తామర పువ్వుతో పాటు, గాంధీజీ చిత్రం, అలాగే ఆయన ప్రముఖ సూక్తులో ఒకటైన ‘మై లైఫ్ ఇస్ మై మెసేజ్’ను పొందుపరిచారు.


Related Post