అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్ తో కలిసి వైట్‌హౌస్ దీపం వెలిగించి దీపావళి వేడుక జరుపుకున్నారు. చీకటిని తొలిగించి జ్ఞానమార్గాన్ని చూపే పండుగే దీపావళి అని జో బైడెన్ అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా అమెరికాలో నివశిస్తున్న భారతీయులందరికీ జో బైడెన్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.
దీపావళి సందర్భంగా తొలిసారిగా వాషింగ్‌టన్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై డిజిటల్ డిస్ ప్లే లైట్లతో దీపావళి థీమ్‌ను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని హడ్సన్ నదీ తీరంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు.