ఆస్ట్రేలియా వెళ్ళేవారికి శుభవార్త

November 01, 2021
img

భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ఇంకా అనుమతి లభించక పోయినప్పటికీ ఆ టీకా వేసుకొన్నవారిని ఆస్ట్రేలియాకు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు ఆస్ట్రేలియా హైకమిషనర్ ఈరోజు తెలిపారు. అలాగే ఆస్ట్రాజనికా, మిక్స్ డ్ వ్యాక్సిన్, మోడేర్నా టీకాలు తీసుకున్నవారిని కూడా దేశంలోకి అనుమతిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. టెక్నికల్ గ్రూప్ అడ్వైజరీ ఆమోదం పొందిన టీకాలు తీసుకున్న ప్రయాణికులకు దేశంలోకి అనుమతి కల్పిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి రెండు డోసులు కోవాక్సిన్ తీసుకున్న పర్యాటకులు 14 రోజుల హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండవలసిన అవసరం కూడా లేదని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు. కానీ రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోనివారు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. 


Related Post