ఇండో-అమెరికన్ నీరా టండన్‌కు మరో కీలక పదవి

October 23, 2021
img

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలో పలువురు ఇండో-అమెరికన్లకు కీలక పదవులు లభించిన సంగతి తెలిసిందే. తాజాగా జో బైడెన్‌కు సీనియర్ అడ్వైజర్‌ ఉన్న నీరా టండన్‌కు అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌ సిబ్బందిని నిర్వహించే విభాగానికి కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు.  వాస్తవానికి జో బైడెన్‌ ఆమెను ఆరు నెలల క్రితమే వైట్‌హౌస్‌ ఆఫీస్ మేనేజిమెంట్ అండ్ బడ్జెట్‌ విభాగానికి అధినేతగా నామినేట్ చేసినప్పటికీ అప్పుడు రిపబ్లికన్ పార్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడంతో జో బైడెన్‌ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ పదవికి సెనేట్ ఆమోదం అవసరం లేదని వైట్‌హౌస్‌ తెలిపింది.      


Related Post