హైదరాబాద్‌వాసికి అమెరికా ప్రభుత్వంలో కీలక పదవి

October 21, 2021
img

హైదరాబాద్‌కు చెందిన వినయ్ తుమ్మలపల్లిని అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడిఏ) తాత్కాలిక డిప్యూటీ డైరెక్టర్‌గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. యుఎస్ సెనెట్ పూర్తిస్థాయి డైరెక్టర్‌ను నియమించే వరకు ఆయన తాత్కాలిక డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. విదేశీ వాణిజ్య వ్యవహారాలలో యూఎస్‌టీడిఏ ముఖ్య పాత్ర పోషిస్తుంది.

వినయ్ 1974లో యుఎస్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన తండ్రి టీ.ధర్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోరనిక్స్ సైన్సెస్ లేబరేటరీ శాస్త్రవేత్తగా పని చేశారు. వినయ్‌ని అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా బెలీజి రాయబారిగా నియమించారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన వినయ్ పారిశ్రామికవేత్త కూడా. అమెరికాలోని కొలరాడో నగరంలో ఆయనకు సొంతంగా సీడి, డీవీడీ, ఆప్టికల్ డిస్కులు తయారుచేసే పరిశ్రమ ఉంది. ప్రవాస భారతీయుడైన వినయ్ తుమ్మలపల్లి యూఎస్‌టీడిఏ ప్రధాన నిర్వహణ డైరెక్టర్‌గా నియమితులు కావడం పట్ల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


Related Post