జపాన్‌కు కొత్త ప్రధానిగా ఫుమియో కిషిడ

September 30, 2021
img

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో జపాన్ ఒకటి. జపాన్ ఉత్పత్తులంటే నాణ్యతకు మరో పేరుగా నిలుస్తున్నాయి. జపాన్ ప్రజలలో క్రమశిక్షణ కూడా ఎక్కువే. ఏవిదంగా చూసినా జపాన్ గొప్పగానే కనిపిస్తుంటుంది. అయినప్పటికీ అక్కడ ప్రతీ రెండు మూడేళ్ళకు దేశ ప్రధాని ఏదో వివాదంలో చిక్కుకొని రాజీనామా చేయడం పరిపాటిగా మారింది. కరోనాను ఎదుర్కోవడంలో చాలా అసమర్ధంగా వ్యవహరించడమే కాక కరోనా సమయంలో జపాన్‌లో ఒలింపిక్స్ నిర్వహించినందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొని పదవిలో నుంచి తప్పుకొన్నారు జపాన్ ప్రధాని యోషిహిడే సుగ. ఇప్పుడు ఆయన స్థానంలో ఆ దేశ విదేశాంగమంత్రిగా పనిచేస్తున్న ఫుమియో కిషిడ జపాన్‌కు కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈయన ఏ వివాదంలో చిక్కుకొంటారో...ఎంత కాలం ప్రధానిగా కొనసాగుతారో చూడాలి.       


Related Post