తాలిబన్లకూ ముహూర్తం కుదరలేదు

September 11, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైన తాలిబన్లు, శనివారం మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తాలిబన్లను మిత్రులుగా భావిస్తున్న చైనా, పాకిస్థాన్‌, టర్కీ, రష్యా, ఇరాన్‌లో, ఖతర్ దేశాలను ఆహ్వానించారు. కానీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తాలిబన్ల సాంస్కృతిక కమిషన్‌ సభ్యుడు ఇమానుల్లా తెలిపారు. 

ఇందుకు బలమైన కారణమే ఉంది. 20 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజున అంటే సెప్టెంబర్ 11వ తేదీన అల్-ఖైదా ఉగ్రవాదులు న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై విమానాలతో ఢీ కొట్టించారు. ఆ ఘటనలో సుమారు 3,000 మంది మరణించగా వందలాదిమంది గాయపడ్డారు. కనుక సెప్టెంబర్ 11వ తేదీని అమెరికా చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన రోజుగా పరిగణిస్తుంటారు. సరిగా ఇదేరోజున కరడుగట్టిన ఉగ్రవాదులు తాలిబన్లు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ పగ్గాలు చేపడుతుండటంతో ఈ కార్యక్రమానికి హాజరుకావద్దని మిత్రదేశాలను కోరింది. వారు కూడా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని తాలిబన్లపై ఒత్తిడి తేవడంతో వాయిదా వేసుకోక తప్పలేదు.

అయితే మంత్రులకు శాఖల కేటాయింపులు అయిపోయినందున వారు ఇప్పటికే పని మొదలుపెట్టారని, కనుక వారి ప్రమాణస్వీకార కార్యక్రమం కేవలం లాంఛనప్రాయమేనని ఇమానుల్లా తెలిపారు. త్వరలోనే మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇమానుల్లా తెలిపారు.

Related Post