మేము విడాకులు తీసుకొన్నాం: ఆయేషా ముఖర్జీ

September 08, 2021
img

భారత్‌ క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకులు తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఆయేషా ముఖర్జీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశారు. వీరు 2012లో వివాహం చేసుకొన్నారు. అంటే పెళ్ళయి ఎనిమిదేళ్ళు మాత్రమే అయ్యింది. కానీ ఇరువురి మద్య తరచూ మనస్పర్ధలు ఏర్పడుతుండటంతో విడిపోతున్నట్లు ఆయేషా ముఖర్జీ తెలిపారు. ఈ దంపతులకు 7 ఏళ్ళు వయసున్న జొరావర్ అనే ఓ కుమారుడు ఉన్నాడు. 

మెల్‌బోర్న్‌ నగరంలో స్థిరపడ్డ ఆయేషా ముఖర్జీ అమెచ్యూర్ కిక్ బాక్సర్. ఆమెకి ఇదివరకే ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో  వివాహమైంది. కానీ అతనితో మనస్పర్ధలు ఏర్పడటంతో విడాకులు తీసుకొంది. అప్పటికే వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. 2009లో శిఖర్ ధావన్‌తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకొన్నారు. ఆమె ఇద్దరి కుమార్తెల బాధ్యతను కూడా శిఖర్ ధావన్ సంతోషంగా స్వీకరించడమే కాక వారి కోసం మెల్‌బోర్న్‌కి మారి అక్కడే ఉంటున్నాడు. ఆయేషా, ధావన్లకు జొరావర్ అనే 7 ఏళ్ళ కొడుకు ఉన్నాడు.   

 “మొదటిసారి విడాకులు తీసుకొంటున్నప్పుడు నేను నా తల్లితండ్రులని, పిల్లలని, నన్ను నేను మోసం చేసుకొంటున్నాననే అపరాధ భావనతో కుమిలిపోయాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి విడాకులు తీసుకొంటునప్పుడు నా ఆవేదన 100 రెట్లు పెరిగింది. దీంతో నా సర్వస్వం పణంగా ఒడ్డినట్లు అనిపిస్తోంది. ఈ నిర్ణయం నన్ను చాలా క్రుంగదీస్తున్నప్పటికీ, ఈ రెండు విడాకులతో నేర్చుకొన్న అనేక పాఠాలతో మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నాను. విడాకులు తీసుకోవడమంటే నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోవడమే తప్ప జీవితాన్ని త్యాగం చేయడం కాదని భావిస్తున్నాను. మనం ఎంత అత్యుత్తంగా వ్యవహరించినా కొన్నిసార్లు ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదని గ్రహించాను....” అంటూ రెండోసారి విడాకులు తీసుకొంటున్న సందర్భంగా తను అనుభవిస్తున్న మనోవేదనను ఆయేషా ముఖర్జీ ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్గమైన లేఖ ద్వారా వివరించే ప్రయత్నం చేసింది.            


Related Post