తాలిబన్ అగ్రనేత ముల్లా హెబతుల్లాకు ఆఫ్ఘన్‌ పగ్గాలు?

September 03, 2021
img

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇరాన్‌లో తరహాలో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తాలిబన్ల సమాచార కమీషన్‌కు ఉన్నతాధికారి ముఫ్తీ ఇనాముల్లా తెలిపారు. తాలిబన్ల అగ్రనేతలో ఒకరైన ముల్లా హెబతుల్లా అఖూంజాదా(60) నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని తెలిపారు. ఆయన దేశానికి సుప్రీం కమాండర్‌గా ఉంటారని, తరువాత స్థానంలో దేశాధ్యక్షుడు ఉంటారని తెలిపారు. మంత్రివర్గం కూడా సిద్దమైందని ఒకటిరెండు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలలో పనిచేసిన వారెవరికీ తాలిబన్ల ప్రభుత్వంలో చోటు ఉండబోదని ముఫ్తీ ఇనాముల్లా స్పష్టం చేశారు.  

గతంలో తాలిబన్ల రాక్షత్వం, అరాచకాలను చూసిన ఆఫ్ఘన్‌ ప్రజలు ఇకపై తాలిబన్ల పాలనలో వారు చెప్పినట్లుగా నడుచుకొంటూ జీవితాంతం బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిందే. ఇప్పటివరకు ఉగ్రవాదులుగా ఉన్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటుచేసుకొంటే భారత్‌, అమెరికాతో సహా అన్ని దేశాలు వారి ప్రభుత్వాన్ని గుర్తించాల్సి ఉంటుంది. వారితో దౌత్య, వాణిజ్య, రాజకీయ సంబంధాలు నెరపవలసి వస్తుంది. ఈ పరిణామాలు అటు ఆఫ్ఘన్‌ ప్రజలకు, ఇటు ప్రపంచదేశాలకు కూడా మింగుడుపడటం చాలా కష్టమే. కానీ వేరే గత్యంతరం లేదు కనుక తప్పదు.మరి తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో... వారితో ప్రపంచదేశాలు ఏవిదంగా వ్యవహరిస్తాయో రాబోయే రోజుల్లో చూడొచ్చు.

Related Post