అమెరికాకు తాలిబన్లు వార్నింగ్... డెడ్‌లైన్‌

August 23, 2021
img

తీవ్ర సంక్షోభంలో చిక్కుకొన్న ఆఫ్ఘనిస్తాన్‌లో నేటికీ అమెరికన్ దళాల అధీనంలో కాబూల్ విమానాశ్రయం ఉండటంతో అమెరికాతో సహా పలుదేశాలకు చెందిన ప్రజలను తరలించగలుగుతున్నారు. ఈ నెలాఖరుకల్లా అమెరికన్ దళాలను ఉపసంహరించుకోవాలని అమెరికా ప్రభుత్వం భావించింది. కానీ ఇంకావేలాదిమందిని తరలించవలసి ఉండటంతో ఈ గడువును మరికొంతకాలం పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటిపై తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడువులోగా కాబూల్ విమానాశ్రయం నుంచి అమెరికన్ సేనలను ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. గడువు పొడిగిస్తే కాబూల్ విమానాశ్రయం వద్ద తాలిబన్లతో పెద్ద యుద్ధం తప్పకపోవచ్చని జో బైడెన్‌కు కూడా తెలుసు. కనుక తాలిబన్లతో యుద్ధానికే మొగ్గు చూపుతారో లేదా దేశం విడిచి వెళ్ళిపోయేముందు మరికొంత మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు పణంగా పెట్టడం ఎందుకని భావిస్తే ఆగస్ట్ 31న పూర్తిగా ఉపసంహరించుకొంటారో చూడాలి. 


Related Post