అమెరికాలో మరో భారత్‌ మహిళకు కీలక పదవి

July 10, 2021
img

జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత భారత సంతతికి చెందిన పలువురు కీలక పదవులు పొందారు. తాజాగా హెల్త్ పాలసీ నిపుణురాలు డాక్టర్ మీనా శేషమణి (43)ని యూఎస్ సెంటర్‌ ఫర్ మెడికర్‌ డెప్యూటీ అడ్మినిస్ట్రేటర్ అండ్ డైరెక్టరుగా నియమింపబడ్డారు. అమెరికాలో 65 ఏళ్ళు పైబడి మెడికేర్ కవరేజ్ హెల్త్ పాలసీపై ఆధారపడిన వృద్ధులకు తగిన వైద్య సేవలు పొందడానికి అవసరమైన యంత్రాంగాన్ని పర్యవేక్షిస్తుంటుంది. ముఖ్యంగా వికలాంగులు, కిడ్నీ తదితర దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సహకరిస్తుంది. 

డాక్టర్ మీనా శేషమణి బ్రౌన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎకనామిక్స్‌లో బీఏ ఆనర్స్ చేసిన తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్‌సల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఎండీ చేశారు. తరువాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి హెల్త్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఆఫ్ స్కూల్ ఆఫ్ మెడిసేన్ నుంచి  హెడ్ అండ్ నెక్ సర్జన్‌ డిగ్రీ పొందారు. ఆ తరువాత కొంతకాలం శాన్‌ఫ్రాన్‌సిస్కోలో కేసర్ పెర్మానెంట్ హాస్పిటల్‌లో సర్జన్‌గా పనిచేశారు. 

ఈ పదవి చేపట్టే ముందు డాక్టర్ శేషమణి మెడ్‌స్టార్ హెల్త్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. వైద్యురాలిగా, వైద్య పాలసీ నిపుణురాలిగా, ఎకనామిస్ట్‌గా వివిద రంగాలలో ఆమెకున్న విద్యార్హతలు, అపారమైన అనుభవం కారణంగా ఈ పదవికి ఎంపికయ్యారు.

Related Post