మియామీలో కూలిన భవనం...శిధిలాల కింద 146 మంది

July 02, 2021
img

అగ్రరాజ్యం అమెరికాలో పెను విషాదం చోటు చేసుకోండీ. దక్షిణ ఫ్లోరిడాలోని మియామీలో సర్ఫ్ సైడ్ అనే పట్టణంలో అమెరికా కాలమాన ప్రకారం బుదవారం అర్దరాత్రి దాటిన తరువాత చాంప్లెయిన్ టవర్స్ అనే 12 అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. ఆ భవనంలో మొత్తం 136 ఫ్లాట్స్ ఉండగా వాటిలో 55 హటాత్తుగా కూలిపోయాయి. శిధిలాలలో 146 మంది చిక్కుకొన్నట్లు సమాచారం. సహాయబృందాలు, స్థానిక ప్రజలు కలిసి ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీశారు. బుదవారం రాత్రి నుంచి ఇప్పటివరకు శిధిలాలలో చిక్కుకొన్నవారి కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.. పాక్షికంగా భవనం కూలిపోవడంతో మిగిలిన భవనం కూడా దెబ్బ తింది. కనుక దానిలో నివశిస్తున్న 139 మందిని బయటకు తరలించారు. అది కూడా కూలిపోయేస్థితిలో ఉండటంతో శిధిలాల తొలగింపు పనులు చాలా మెల్లగా...చాలా జాగ్రత్తగా చేయవలసివస్తోంది. దీంతో శిధిలాల కింద చిక్కుకొన్నవారిని రక్షించడం కష్టంగా మారింది. అయితే ఇప్పటికే 48 గంటలు గడిచిపోవడంతో శిధిలాల కింద చిక్కుకొన్నవారు ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని భావిస్తున్నారు

ఈ భవనం 40 ఏళ్ళ క్రితం నిర్మించగా మూడేళ్ళ క్రితం భవనం బేస్ మెంటులో పగుళ్ళు కనబడినట్లు తెలుస్తోంది. అయితే తగిన చర్యలు, జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ దారుణం జరిగింది.

Related Post