ఈనెల 21వరకు యూఏఈకి వెళ్ళడం సాధ్యం కాదు

July 02, 2021
img

ప్రపంచవ్యాప్తంగా డెల్టా ప్లస్ వైరస్ కేసులు బయటపడుతుండటంతో అప్రమత్తమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈనెల 21వ తేదీ వరకు భారత్‌, పాక్, శ్రీలంకా, బంగ్లాదేశ్, నేపాల్‌తో సహా మొత్తం 14 దేశాల నుంచి విమానాల రాకపోకలను యూఏఈ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ నిషేదించింది. అయితే సరుకు, మందులు రవాణా చేసే కార్గో విమానాలు, ఛార్టెడ్ విమానాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది. విదేశాలకు వెళ్ళి అక్కడ కరోనాబారిన పది కోలుకొన్న తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాలలో  తీసుకువస్తామని తెలిపింది.     

గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా సౌదీఅరేబియా, యూఏఈలలో లక్షలాదిమంది భారతీయులు పనిచేస్తున్నారు. వారిలో శలవుపై ఇప్పుడు భారత్‌కు వచ్చినవారు ఈ నిషేధంతో తిరిగివెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. జూలై 21 తరువాత నిషేధం ఎత్తివేస్తే పర్వాలేదు కానీ ఇంకా పొడిగిస్తే వారికి ఇబ్బంది తప్పదు. ఇంతకు ముందు అమెరికా, యూరోపియన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారు ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   


Related Post