కోవీషీల్డ్ వాక్సిన్‌కు ఈయు ఆమోదం

July 02, 2021
img

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషిల్డ్ వ్యాక్సిన్‌కు యురోపియన్ (ఈయూ) మెడికల్ ఏజెన్సీ జాబితాలో చేర్చింది. ప్రస్తుతానికి జర్మనీ, గ్రీస్, ఆస్ట్రీయా, ఐస్‌లాండ్, ఐర్లాండ్, స్పెయిన్, స్విజర్లాండ్ దేశాలకు భారతీయ ప్రయాణికులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రయాణించవచ్చు. ఈయూలో మొత్తం 27 సభ్య దేశాలు ఉండగా వాటిలో ఏడు దేశాలు మాత్రమే కోవిషిల్డ్ వ్యాక్సిన్‌ను అంగీకరించాయి. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం దీని కోసం ఈయుపై ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ కోవీషీల్డ్ వాక్సిన్‌ను ఈయు అనుమతించకపోతే యూరప్ నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు సర్టిఫికెట్ ఒప్పుకోమని, కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తామని హెచ్చరించడంతో చివరకు ఈయులో ఏడు సభ్య దేశాలు కోవీషీల్డ్ వాక్సిన్‌ను అంగీకరించాయి. గురువారం నుంచి ఈయు ప్రయాణికులకు గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. గ్రీన్ పాస్ ఈయు డిజిటల్ కోడ్ సర్టిఫికెట్, డాక్యుమెంట్‌గా పిలుస్తారు. దీనిని అనుసరించి కరోనా  రెండు డోసులు తీసుకున్న ప్రయాణికులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది.


Related Post