మెకెంజో స్కాట్ భారత్‌కు రూ.20,000 కోట్లు విరాళం

June 17, 2021
img

అమెజాన్ వెబ్‌సర్వీసస్‌కు వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ నుండి 2019లో విడిపోయి డాన్ జ్యూవెట్‌ను పెళ్ళి చేసుకొన్న మెకెంజో స్కాట్ భారత్‌లోని వివిద ఎన్‌జీవోలకు రూ.20,000 కోట్లు విరాళం ప్రకటించారు. భారత్‌లోని బడుగు బలహీన వర్గాలకు, నిసహాయులకు సేవలండిస్తున్న గివ్ ఇండియా, గూంజ్ మీ, అంతారా ఫౌండేషన్ తదితర 286 ఎన్‌జీవోలలో ఒక్కో సంస్థకు సుమారు రూ.73 కోట్లు చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్నప్పటి నుంచి మెకెంజో స్కాట్ భారీ విరాళాలు ఇస్తున్నారు. గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు ఆమె మొత్తం 8 బిలియన్ డాలర్లు (రూ.6,25,86,77,50,000) విరాళాలు ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన మాజీ భార్య మెలిండా గేట్స్ కలిసి గత 27 ఏళ్ళలో సుమారు 50 బిలియన్ డాలర్లు విరాళాలు ఇచ్చారు. భారత్‌లో కూడా అంబానీ వంటి బిలియనీర్లు చాలా మంది ఉన్నారు కానీ ఎవరూ ఈ స్థాయిలో విరాళాలు ఇవ్వలేదు.  


Related Post