ఆర్ధిక నేరగాడు మోహుల్ చోక్సీ ఆంటిగ్వాలో మిస్సింగ్

May 25, 2021
img

పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి సుమారు రూ.14,000 కోట్లు కొట్టేసి ఆంటిగ్వా దేశానికి పారిపోయిన మోహుల్ చొక్సీ కనబడకుండాపోయారు. నిన్న సాయంత్రం నుంచి ఓ రెస్టారెంట్‌కి వెళ్ళాక మళ్ళీ తిరిగిరాలేదని భారత్‌లో ఆయన తరపున కేసులు వాదిస్తున్న అడ్వకేట్ విజయ్ అగర్వాల్ తెలిపారు. చొక్సీ కుటుంబ సభ్యులా ఫిర్యాదు మేరకు ఆంటిగ్వా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన కోసం గాలిస్తున్నారని తెలిపారు. 

గీతాంజలి సంస్థల గ్రూప్ ఛైర్మన్ మోహుల్ చొక్సీ తన మామ నీరవ్ మోడీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి సుమారు రూ.14,000 కోట్లు కొట్టేసి విదేశాలకు పారిపోయారు. భారత్‌ ప్రభుత్వం వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేయడంతో కరేబియన్ ద్వీప దేశమైన ఆంటిగ్వాకు పారిపోయి బార్బ‌డోస్‌లో ఆశ్రయం పొందారు. ఆంటిగ్వా ప్రభుత్వం వారికి తమ దేశ పౌరసత్వం కూడా కల్పించడంతో గత నాలుగేళ్ళుగా ఇద్దరూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఆర్ధిక నేరగాళ్ళైన వారికి ఆంటిగ్వా పౌరసత్వం, ఆశ్రయం ఇవ్వడంపై భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారీ భారత్‌కు అప్పగిస్తామని ఆంటిగ్వా ప్రభుత్వం హామీ ఇచ్చిన కొన్ని రోజులకే మోహుల్ చొక్సీ కనబడకుండా మాయం అయిపోవడం గమనిస్తే బహుశః ఆయనను కాపాడేందుకు ఆంటిగ్వా ప్రభుత్వమే ఈ పని చేసి ఉండవచ్చనే అనుమానం కూడా కలుగుతోంది.

Related Post