వైట్‌హౌస్‌ సీనియర్ సలహాదారుగా నీరా టండన్‌

May 15, 2021
img

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన పలువురు కీలక పదవులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొకరు అత్యంత కీలక పదవిలో నియుక్తులయ్యారు. ఆమె నీరా టండన్‌... వైట్‌హౌస్‌ సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. నిజానికి ఆమెను వైట్‌హౌస్‌ బడ్జెట్‌ చీఫ్‌గా నియమించాలని జో బైడెన్‌ భావించారు కానీ గతంలో ఆమె సెంట‌ర్ ఫ‌ర్ అమెరిక‌న్ ప్రోగ్రెస్ (సీఏపీ) అధ్య‌క్షురాలిగా ప‌నిచేస్తున్నప్పుడు రిపబ్లికన్ పార్టీకి చెందిన కొందరు నేతలపై విమర్శలు చేశారు. కనుక సెనేట్‌ సమావేశంలో వారు ఆమె నియామకాన్ని వ్యతిరేకించారు లేకుంటే ఆమె ఆ పదవి చేపట్టి ఉండేవారు. అయితే నీరా టండన్‌ పనితీరు, ధృఢచిత్తం చూసి జో బైడెన్‌ ఆమెను వైట్‌హౌస్‌ సీనియర్ సలహాదారుగా నియమించుకొన్నారు. ఆమె నియామకానికి సెనేట్ సభ్యుల ఆమోదం అవసరం లేకపోవడంతో ఆమె ఈ కీలక పదవి లభిచింది. జో బైడెన్‌ ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తున్న ‘హెల్త్ కేర్’ సంబందిత అంశాలను నీరా టండన్‌ స్వయంగా పర్యవేక్షిస్తారని తెలుస్తోంది. 


Related Post