చైనా నుంచి మానవాళికి మరో ప్రమాదం

May 06, 2021
img

యావత్ ప్రపంచదేశాలకు కరోనా మహమ్మారిని అంటగట్టి మానవాళికి తీరని అపకారం చేసింది చైనా. ఇప్పుడు చైనా వల్ల మానవాళికి మరో ప్రమాదం ముంచుకువస్తోంది. ఈసారి ఆకాశంలో నుంచి ప్రమాదం దూసుకువస్తోంది. సుమారు 21 టన్నుల బరువున్న చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బి అనే అంతరిక్షవాహనం నిర్ధిష్ట కక్ష్యలో నుంచి అదుపు తప్పి పేలిపోవడం దాని శఖలాలు శరవేగంగా భూమివైపు దూసుకువస్తున్నాయి. సాధారణంగా రాకెట్, ఉపగ్రహ శఖలాలు సముద్రంలో కూలిపోయేలా చేస్తుంటారు. కానీ ఇవి మాత్రం భూమిపై పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఇవి బీజింగ్, మ్యాడ్రిడ్, న్యూయార్క్, న్యూజిలాండ్‌లో ఎక్కడైనా మరో రెండు మూడు రోజులలోగా పడే అవకాశం ఉందని సమాచారం.

చైనా అంతరిక్షంలో టియాన్హీ అనే ఓ శాస్విత భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తోంది. దానిలో భాగంగానే ఏప్రిల్ 29న లాంగ్ మార్చ్ 5బిని ప్రయోగించింది. దాని ద్వారా టియాన్హీకి అవసరమైన కొన్ని ప్రధానభాగాలను అంతరిక్షంలోకి పంపించింది. వాటిని అక్కడ ఒక దానితో మరొకటి కలపాల్సి ఉండగా లాంగ్ మార్చ్ 5బి నిర్ధిష్ట కక్ష్యలో నుంచి పక్కకు తప్పడంతో నియంత్రణ కోల్పోయి మళ్ళీ భూమి వైపుకి దూసుకువస్తోంది. 

ఆ వేగానికి అది మార్గమద్యంలోనే వేడెక్కి పేలి తునాతునకలైపోవచ్చునని కొందరు శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అలా జరిగితే పెను ప్రమాదం తప్పుతుంది అలాకాక వేరేలా జరిగితే అది పడినచోట భారీ వినాశనం జరిగే ప్రమాదం ఉంటుంది. చైనా చుట్టుపక్కల దేశాలను, సముద్రజలాలను కబళించాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ అనేక దేశాలకు నిత్యం సమస్యలు సృష్టిస్తూనే ఉంటుంది. కరోనాతో యావత్ మానవాళి మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసింది. ఇవి సరిపోవన్నట్లు చైనా ఇప్పుడు అంతరిక్షంలో చేస్తున్న ఈ ప్రయోగాలు కూడా మానవజాతికి ప్రమాదకరంగా మారాయి.

Related Post