మెక్సికోలో కూలిన మెట్రో బ్రిడ్జ్...కిందపడిన మెట్రో రైల్‌!

May 04, 2021
img

మెక్సికో నగరంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానప్రకారం నిన్న రాత్రి సుమారు 10.30 గంటలకు మెట్రో రైల్‌ ప్రయాణిస్తుండగా మెట్రో ఫ్లై ఓవర్‌ హటాత్తుగా కూలిపోవడంతో మెట్రో రైల్‌ కిందపడిపోయింది. ఆ సమయంలో ఆ ఫ్లై ఓవర్‌ కింద నుంచి వెళుతున్న వాహనాలపై మెట్రో బోగీలు, వంతెన శిధిలాలు పడటంతో వాటి కింద నలిగి 13 మంది చనిపోయారు. మరో 70 మంది వరకు గాయపడ్డారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకొని అతి కష్టం మీద శిధిలాల కింద చిక్కుకొన్నవారిని బయటకు తీసి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బహుశః నాసిరకం కట్టడం కారణంగానే మెట్రో ఫ్లై ఓవర్‌ కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 


Related Post