భారత్‌లో కరోనా పెరగడానికి కారణాలివే...

April 28, 2021
img

ప్రపంచదేశాలకు వాక్సిన్లు అందించి కాపాడవలసిన భారత్‌ ఇప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతుండటంపై చాలా దేశాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి. యధాశక్తిన సాయం అందిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భారత్‌లో కరోనా ఇంత తీవ్రరూపం దాల్చడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఈ దుస్థితి ఏర్పడటానికి కారణాలను వివరించింది. 

 ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి తారిక్ జసారెవిక్ జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం భారత్‌ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. భారత్‌లో కరోనా ఇంత త్వరగా వ్యాపించడానికి కొన్ని కారణాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. 1. సామూహిక సభలు, సమావేశాలు నిర్వహించడం. 2. స్వల్ప కరోనా లక్షణాలున్నవారికి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందే విధానం గురించి ప్రభుత్వం అవగాహన కల్పించకపోవడం. ఆ కారణంగా కరోనా సోకగానే ప్రజలు భయాందోళనకు గురై ఆసుపత్రులకు పరుగులు తీస్తుండటం. ఆ కారణంగా ఆసుపత్రులు నిండిపోయి అత్యవసరమైనవారికి చికిత్స లభించకపోవడం. 3. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం. 4. వాక్సిన్ కొరత ఉన్నప్పుడు ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వంటి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. భారత్‌కు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్, వైద్య పరికరాలు వగైరా పంపిస్తున్నాము. కనుక ఈ సమస్యలను పరిష్కరించుకోగలిగితే భారత్‌ కరోనా నుంచి బయటపడగలదని మేము భావిస్తున్నాం,” అని అన్నారు. 

Related Post