భారత్‌ పరిస్థితిపై సత్య నాదెళ్ళ, సుందర్ పిచాయ్ తీవ్ర ఆవేదన

April 26, 2021
img

మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈఓలు సత్య నాదెళ్ళ, సుందర్ పిచాయ్ ఇరువురూ భారత్‌లోని కరోనా పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు.  

సత్య నాదెళ్ళ స్పందిస్తూ, “భారత్‌లో పరిస్థితి చూసి నా గుండె పగిలిపోయింది. ఈ సందర్భంగా భారత్‌కు సాయపడేందుకు ముందుకువచ్చిన అమెరికాకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మైక్రోసాఫ్ట్ సంస్థ తన గొంతును, పలుకుబడిని, వనరులను, టెక్నాలజీని అన్నిటినీ వినియోగించి భారత్‌కు అవసరమైన మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ సరఫరా అందజేస్తుంది,” అని ట్వీట్ చేశారు. 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ, “భారత్‌లో నానాటికీ దిగజారుగుతున్న పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నాను. గూగుల్ మరియు గూగ్లర్స్ కలిపి @గివ్ ఇండియా, @యునిసెఫ్ ద్వారా భారత్‌కు రూ.135 కోట్లు ఆర్ధికసాయం అందజేశాము. క్లిష్ట పరిస్థితులలో ఉన్న రోగులకు చికిత్స అందిస్తున్న సంస్థలకు, మందుల కొనుగోలుకు అది ఉపయోగపడుతుంది,” అని ట్వీట్ చేశారు. 

 


Related Post