కామ్‌స్కోప్ సీఈఓగా ప్రవీణ్ జొన్నలగడ్డ నియామకం

April 09, 2021
img

నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన ప్రవీణ్ జొన్నలగడ్డ (45) అమెరికాలోని ప్రసిద్ద కంపెనీలలో ఒకటైన కామ్‌స్కోప్ కంపెనీకి సీఈఓ (చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)గా నియమితులయ్యారు. ఆయన గత 12 ఏళ్లుగా కామ్‌స్కోప్ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌, సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ హోదాలలో పనిచేశారు. కామ్‌స్కోప్ కంపెనీ ప్రధానంగా వైర్‌లెస్ నెట్‌వర్క్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగంలో ప్రసిద్ధిగాంచింది.

ప్రవీణ్ జొన్నలగడ్డ తల్లితండ్రులు రంగారెడ్డి, విమాలాదేవి దంపతులు మిర్యాలగూడ మండలంలోని గూడూరులో నివాసం ఉంటున్నారు. కనుక ప్రవీణ్ జొన్నలగడ్డ బాల్యం, చదువులు అన్ని అక్కడే జరిగాయి. ఆ తరువాత మిర్యాలగూడా ఎయిడెడ్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ చేసారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ, తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. భారత్‌లో కొనేళ్ళు పనిచేసిన తరువాత 2008లో అమెరికా వెళ్ళి ఒకటైన కామ్‌స్కోప్ కంపెనీలో చేరారు. అప్పటి నుంచి దానిలోనే వివిద హోదాలలో పనిచేస్తూ, ఇప్పుడు సీఈఓ పదవి చేపడుతున్నారు.

Related Post