జో బైడెన్‌కు స్వల్పగాయం

November 30, 2020
img

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ నిన్న తన పెంపుడు కుక్క మేజర్‌తో ఆడుకొంటుండగా కుడికాలు బెణికింది. వెంటనే సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు ఎక్స్‌-రే, సీటీ స్కాన్ పరీక్షలు చేశారు. ఆయన కుడికాలు చీలమండ దగ్గర స్వల్పంగా హెయిర్ క్రాక్ ఫ్రాక్చర్ అయినట్లు డాక్టర్ కెవిన్ ఓ కొన్నార్ తెలిపారు. అదేమీ పెద్ద గాయం కాదు కనుక మందులు వాడుతూ, నాలుగైదు రోజులు విశ్రాంతి తీసుకొంటే సరిపోతుందని చెప్పారు. కానీ కొన్ని వారాలపాటు ప్రత్యేకంగా రూపొందించి బూట్లు ధరించి తిరుగవలసి ఉంటుందని చెప్పారు. 

జో బైడెన్‌ వయసు 78 సం.లు. ఈ వయసులో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా నిలిచిపోనున్నారు.  అయితే అధ్యక్షపదవి ఇంకా చేపట్టక మునుపే ఆయన ఈవిధంగా గాయపడటంతో విమర్శకులకు అవకాశం కల్పించినట్లయింది. ముఖ్యంగా ఆయనపై ఆగ్రహంతో రగిలిపోతున్న డోనాల్డ్ ట్రంప్‌కు, ఆయన వర్గానికి జో బైడెన్‌ను వేలెత్తి చూపేందుకు అవకాశం కల్పించినట్లయింది. “ఈ వృద్దుడా అమెరికాను నడిపించేది?” అంటూ డోనాల్డ్ ట్రంప్‌ ట్వీట్ బాణం సందించకుండా ఉంటే ఆశ్చర్యమే.

Related Post