మారుతి-ప్రభాస్ ‘రాజాసాబ్’ చాలా భారీ అంచనాలతో జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక త్వరలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని నిర్మాత టీజీ ప్రసాద్ చెప్పారు. అయితే రాజాసాబ్ ఈవెంట్ అంటే కనీసం 50 వేలమందిపైనే వచ్చే అవకాశం ఉంటుంది. కనుక అంతమందికి సరిపడే ప్రదేశం కోసం వెతుకులాట జరుగుతోంది.
ఎల్బీ స్టేడియం వంటివన్నీ ముందే క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు బుక్ అయిపోయాయి. కనుక సరైన వేదిక లభించగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 27 (శనివారం)న రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అభిమానులకు క్రిస్మస్, న్యూఇయర్ కానుకగా ఈ వేడుకలో మరో ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ద్రువీకరించాల్సి ఉంది.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, జరీనా వాహబ్, రిద్ధి కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.