నెట్‌ఫ్లిక్స్‌లో ఆంధ్రా కింగ్‌ తాలూకా…

December 20, 2025


img

మహేష్ బాపు దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా చేసిన ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’ నవంబర్‌ 27న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కనుక ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

వారి ఎదురుచూపులు త్వరలో ముగియనున్నాయి. క్రిస్మస్ పండగ సందర్భంగా ఈ నెల 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆంధ్రా కింగ్ తాలుకా వచ్చేస్తోంది. సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించింది కూడా. అంటే మరో 5 రోజులు అంతే!       

ఈ సినిమాలో సినీ హీరోగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర నటించగా, ఆయన వీరాభిమానిగా రామ్ పోతినేని నటించారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.

ఈ సినిమాకు కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: మహేష్ బాబు బాపు, పాటలు: రామ్ మిరియాల, కార్తీక్ సంగీతం: వివేక్, మెర్విన్, కెమెరా: సిద్ధార్థ్ నుని, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలసి ఈ సినిమా నిర్మించారు. 


Related Post

సినిమా స‌మీక్ష