అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా

October 02, 2020
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఆయన భార్య మేలానియా ట్రంప్‌కు కరోనా సోకింది. ట్రంప్‌ సలహాదారులలో ఒకరి ద్వారా వారికి కరోనా సోకింది. దాంతో వైద్యుల సూచనల మేరకు వారిరువురూ హోమ్ క్వారెంటైన్‌లోకి వెళ్లారు. తాము కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ట్రంప్‌ స్వయంగా ట్వీట్ ద్వారా తెలియజేశారు. కరోనా సోకినప్పటికీ తాము పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని, క్వారెంటైన్‌ గడువు ముగిసేవరకు వైట్‌హౌస్‌ నుంచే అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తుంటానని ట్రంప్‌ తెలియజేశారు. 

అధ్యక్ష ఎన్నికలకు నేటికీ సరిగ్గా నెలరోజులు మాత్రమే ఉన్నాయి. ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొని ఉదృతంగా సాగుతున్న ఈ సమయంలో ట్రంప్‌ కరోనా బారినపడటం ఎన్నికలపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిపబ్లికన్ పార్టీలో ఆందోళన నెలకొంది. ఇదే అదునుగా ట్రంప్‌ ప్రత్యర్ధి జో బిడెన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయే అవకాశం ఉంది. అయితే అమెరికన్లు ట్రంప్‌ వంటి బలమైన నాయకుడివైపే మొగ్గు చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కనుక ట్రంప్‌ వారం పది రోజులలోగా కరోనా నుంచి కోలుకొని మళ్ళీ ప్రచారంలో పాల్గొనగలిగితే మళ్ళీ పుంజుకోవచ్చు.

Related Post