బతుకమ్మ పండుగ తేదీలు ఇవే

September 26, 2024
img

తెలంగాణ మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మళ్ళీ వచ్చేస్తోంది. తొమ్మిరోజుల పాటు రోజుకో రకం పూలు, నైవేధ్యాలతో జరుపుకునే బతుకమ్మ పండుగా అక్టోబర్‌ 2వ తేదీన భాద్రపద అమావాస్యనాడు ప్రారంభం అయ్యి అక్టోబర్‌ 10వ తేదీన దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో ముగుస్తుంది. 

మహిషాసురునితో జగన్మాత దుర్గమ్మ పోరాడుతున్నప్పుడు అలిసిపోయి స్పృహ కోల్పోతే అప్పుడు మహిళలు అందరూ ఆమెను బతుకమ్మా బతుకమ్మా అంటూ వెదుకున్నారట. ఆమెకు రోజుకో నైవేధ్యం, పూలతో పూజిస్తూ ప్రార్ధించేసరికి ఆమె పదోరోజున మేల్కొని మహిషాసురిడిని వధించి లోకానికి రాక్షసపీడ నుంచి విముక్తి కల్పించిందని భక్తుల నమ్మకం. ఆవిదంగా బతుకమ్మ పండుగ మొదలైందని చెప్పుకుంటారు.   

తేదీల వారీగా బతుకమ్మ పండుగ వివరాలు: 

అక్టోబర్‌ 2: (మహాలయ అమావాస్య) ఎంగిలపూల బతుకమ్మ

అక్టోబర్‌ 3: అటుకుల బతుకమ్మ (నవరాత్రి కలశ స్థాపన). 

అక్టోబర్ 4: ముద్దపప్పు బతుకమ్మ. 

 అక్టోబర్ 5: నానే బియ్యం బతుకమ్మ.

అక్టోబర్ 6: అట్ల బతుకమ్మ.

అక్టోబర్ 7: అలిగిన బతుకమ్మ (బతుకమ్మకి నైవేద్యం సమర్పించరు)

అక్టోబర్ 8: వేప కాయల బతుకమ్మ.

అక్టోబర్ 9: వెన్న ముద్దల బతుకమ్మ.

అక్టోబర్ 10: సద్దుల బతుకమ్మ (దుర్గాష్టమి) (బతుకమ్మ నిమజ్జనాలు).

Related Post