మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘రాజాసాబ్’ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. కనీసం రాజాసాబ్ అప్‌డేట్ అయినా ఇస్తుంటే చాలా సంతోషించేవారు. కానీ అసలు ఆ సినిమా మొదలేపెట్టలేదన్నట్లు మౌనంగా ఉండిపోయారు దర్శక నిర్మాతలు. అయితే ప్రముఖ నిర్మాత శ్రీనివాస్ కుమార్ త్వరలో రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వస్తోందంటూ ఓ జిఐఎఫ్ పోస్ట్ చేశారు. అది మంటలలో కాలిపోతున్న అస్థిపంజరం. అంటే రాజసాబ్ అప్‌డేట్ కోసం అందరూ మంటల్లో కాలిపోతూ ఆస్థిపంజరాల్లా మారారని చెపుతున్నట్లనిపిస్తుంది. ఆయన ఏ ఉద్దేశ్యంతో అది పోస్ట్ చేసినప్పటికీ రాజసాబ్ ఫస్ట్ సింగిల్ త్వరలో రాబోతోందని చిన్న సంకేతం ఇచ్చారు. కనుక అభిమానులకు ఇది చాలా సంతోషం కలిగించేదే.
ఈలోగా రిలీజ్ డేట్ గురించి రోజుకో మాట వినిపిస్తోంది. కానీ నిర్మాత వారికి సంతోషం కలిగించే వార్త చెప్పారు.
పాన్ ఇండియా మూవీగా రాజాసాబ్ నిర్మిస్తున్నందున హిందీ బయ్యర్స్ అభ్యర్ధన మేరకు డిసెంబర్ 5 లేదా 6 తేదీలలో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.
ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
రాజాసాబ్ సినిమాకు సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.
#TheRajaSaab first single
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 10, 2025
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/7sndrGIr3F