మహానటి, సీతా రామం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ తాజాగా మరో తెలుగు సినిమా చేయబోతున్నాడు. రవి నెలకుదిటి దర్శకత్వంలో డీక్యూ 41 వర్కింగ్ టైటిల్‌తో మొదలుపెట్టిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈరోజు రామోజీ ఫిల్మ్ సిటీలో వారిద్దరిపై ఒకటి రెండు షాట్స్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యిందని తెలియజేశారు.
శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమా బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్; కెమెరా: అనే గోస్వామి, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు. ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.