కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా చేస్తున్న‘కె-ర్యాంప్’నుంచి ‘కలలే కలలే...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ పాట ఈరోజు సాయంత్రం 5.45 గంటలకు విడుదల కాబోతోంది. ఆలోగా ఈ పాట ప్రమో విడుదల చేశారు. భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటకి చేతన్ భరద్వాజ సంగీతం అందించగా కపిల్ కపిలన్ పాడారు.
‘కే ర్యాంప్’తో జైన్స్ నాని దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీనియర్ నరేష్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: జైన్స్ నాని, డైలాగ్స్: రవీంద్ర రాజా, సంగీతం: చేతన్ భరద్వాజ, కెమెరా: సతీష్ రెడ్డి మాసం, యాక్షన్: పృధ్వీ, ఆర్ట్: సుధీర్ మాచర్ల, ఎడిటింగ్: ఛోటా కే ప్రసాద్ చేస్తున్నారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ సినిమాకి సహ నిర్మాతలు బాలాజీ గుట్ట, ప్రభాకర్ బురుగు. అక్టోబర్ 18న ఈ సినిమా విడుదల కాబోతోంది.