ఓ పక్క కేంద్ర ప్రభుత్వం దేశంలో మావోయిస్టులను ఏరిపారేస్తుంటే, ప్రాణ భయంతో లొంగిపోయేవారు లొంగిపోతున్నారు. ఎదురుతిరిగినవారు సాయుధ దళాల కాల్పులలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎట్టి పరిస్థితులలో వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి దేశంలో ఒక్క మావోయిస్టు కూడా లేకుండా ఏరి పారేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా విస్పష్టంగా చెపుతున్నారు.
ఇటువంటి సమయంలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నియామకం జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నంబాల కేశవరావు మరణంతో ఖాళీ అయిన ఆ పదవిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతిని నియమిస్తున్నట్లు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది.
తిప్పిరి తిరుపతి మావోయిస్ట్ దళ సభ్యుడుగా చేరి కేంద్ర కమిటీ సభ్యుడుగా, మిలీషియా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 2010లో దంతేవాడలో కేంద్ర రిజర్వ్ బలగాలపై జరిగిన దాడిలో పాల్గొన్న తిరుపతి తలపై కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు బహుమతి ప్రకటించింది.